నంద్యాల జిల్లా : పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం షరీఫ్ నగర్ కు చెందిన కాశపోగు లక్ష్మిదేవికి ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 5 లక్షల చెక్కును మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి బుధవారం అందజేశారు.
షరీఫ్ నగర్ లో ఇటీవల టీడీపీ నాయకుడు కాశపోగు సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. దీంతో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సంజన్న హత్య సమాచారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తెచ్చి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి మృతుడు సంజన్న కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కును మృతుడు సంజన్న భార్య, భాధితురాలు లక్ష్మిదేవికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తరుపున ఆమె తండ్రి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రూ. 5 లక్షలు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మృతుడు సంజన్న కుమారుడు కార్పొరేటర్ జయరాముడు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Leave a Reply