కర్నూలు జిల్లా కౌతాళం : మండల పరిధిలోని ఊరుకుంద గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నందు ఉన్న గో సంరక్షణ కొరకుజోహారాపురం వాస్తవ్యులైన దూదేకొండ సీతారాం రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ₹.30,000/- వేల రూపాయలు ఆన్లైన్ నందు విరాళంగా చెల్లించారు.వారికి దేవస్థాన కార్యనిర్వాహనాధికారి మరియు ఉప కమిషనర్ మేడిపల్లి విజయరాజు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి,బాండు పేపర్, పూలమాలతో సత్కరించారు.ఈకార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది జంగం రాజేశ్వరి పాల్గొన్నారు.
శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం నందు గో సంరక్షణ కొరకు విరాళం

Leave a Reply