ప్రతి మొక్క మన శ్వాస….ప్రతి నీటి బొట్టు మన జీవం

పల్నాడు జిల్లా / పెదకూరపాడు : ప్రతి మొక్క మన శ్వాసాన్ని ప్రతి నీటి బొట్టు మన జీవమని పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్యకరమైన జీవితమని అదే మన అందరి లక్ష్యం కావాలని పెదకూరపాడు తహసిల్దార్ నీలి ధనలక్ష్మి అన్నారు. పెదకూరపాడు మండలంలోని బుచ్చయ్యపాలెం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్రం సౌజన్యముతో బుచ్చయ్యపాలెం గ్రామ మాజీ సర్పంచ్ పరుచూరి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో  పోలేరమ్మ తల్లి గుడి ప్రాంగణంలో గురువారం మొక్కలు నాటారు.ఈ సందర్భంగా తాసిల్దార్ ధనలక్ష్మి మాట్లాడుతూ పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్యకరమైన జీవితం అదే మన లక్ష్యం కావాలని అన్నారు.పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే భవిష్యత్తు తరాలను కాపాడుకున్న వారమవుతామన్నారు.తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి భాష్యం ఆంజనేయులు మాట్లాడుతూ ప్రకృతి మనం నివసించడానికి అవసరమైన గాలి,నీరు, భూమి,చెట్లు,పక్షులు ఇవన్నీ పర్యావరణమేనని అన్నారు. చెట్ల పెంపకం,వనరుల సంరక్షణ ద్వారా పర్యావరణ రక్షణలో పాలుపంచుకుందాం అన్నారు.ఈకార్యక్రమంలో పాలుడుగు శ్రీధర్,పరుచూరి రవి,సండ్ర పూర్ణచంద్రరావు, పరుచూరి శివరాంప్రసాద్, వేమవరపు యలమంద తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నెమలినార, ఉసిరి,దానిమ్మ,జామ, సీతాఫలం,తంగేడు,నేరేడు, కాంచన,గంగ,నిమ్మ,రావి మొక్కలను నాటారు.

Share this