ప్రజలపై భారాల మోత, సంక్షేమం కన్నా బాదుడే ఎక్కువ: సిపిఎం

నంద్యాల జిల్లా ఆత్మకూరు : టిడిపి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సంక్షేమాన్ని ప్రక్కన పెట్టి ప్రజలపై పన్నులు, చార్జీల భారాలు మోపుతుందని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్, శాఖ కార్యదర్శి ఏ సురేంద్ర లు విమర్శించారు.స్థానిక

పట్టణంలోని  సుదర్శన వర్మ భవన్ నందు సిపిఎం పార్టీ శాఖ సమావేశం పట్టణ నాయకులు జి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ

గత ప్రభుత్వ పరిపాలనలో ప్రజలపై ఒక బాధుడు ఉంటే టిడిపి కూటమి పాలనలో మూడు రకాల బాదుడు ఉందన్నారు . ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమాన్ని అమలు చేయకపోగా పన్నుల భారాలు మోపి సామాన్యుల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుకున్నట్లు ఆస్తి పన్నులు 15 శాతం పెంచితే ఆత్మకూరు పట్టణంలో ప్రజలపై దాదాపు 35 లక్షల నుంచి 50 లక్షలు భారం పడుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అదనపు భారం మోయాల్సిన వస్తుందన్నారు. రాష్ట్రాన్ని ఆదాని ప్రదేశంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆదాని భజన చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసేందుకు వస్తే ప్రజలు తిరగబడాలని కోరారు. ప్రజలపై బాదుకు స్వస్తి చెప్పి సంక్షేమాన్ని అధికమించేలా పాలన సాగించాలని ప్రజలపై పన్నుల భారాలు వేసేందుకు ప్రయత్నిస్తే సిపిఎం ఆధ్వర్యంలో అడ్డుకుంటామని వారు అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు  ఏ. కిరణ్, తుమ్మలూరు శివకుమార్, నూర్ అహ్మద్, హుస్సేన్ భాష,రఫీ,రైట్ బాషా, ఉసెనాలం,శేషయ్య, అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

Share this