నేడు కళారాధన వేసవి శిక్షణా శిబిరాల ముగింపు ఉత్సవం

*   ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్ లో సాయంత్రం ఐదు గంటల నుండి

* కళారాధన రజతోత్సవ వేడుకలలో మొదటి కార్యక్రమం

*   24వ ఉచిత లలిత కళల వేసవి శిక్షణ శిబిరం

*   పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారి గుర్రాల రామకృష్ణయ్య ప్రతిభా పురస్కారాల ప్రదానం

*  శిక్షణ పొందిన బాలబాలికల చేత సాంస్కృతిక ప్రదర్శనలు

నంద్యాల : కళారాధన సాంస్కృతిక సంస్థ గత 25 సంవత్సరాలుగా   నిర్వహిస్తున్న ఉచిత  లలిత కళల వేసవి శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం సోమవారం సాయంత్రం ఐదు గంటల నుండి మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహిస్తున్నారు. కళారాధన, నంద్యాల లయన్స్ క్లబ్, ఐఎంఏ సంయుక్త నిర్వహణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ సహకారంతో మే 1వ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు 300 మంది బాల బాలికలు, యువతకు వివిధ అంశాలలో 30 మంది  కోచ్ లతో స్థానిక కేఎన్ఎం పురపాలక పాఠశాల ఆవరణలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించారు. ముగింపు ఉత్సవంలో శిక్షణ పొందిన  బాలబాలికల సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.ఇదే కార్యక్రమంలోనే పదవ తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రిటైర్డ్ జిల్లా విద్యాశాఖ అధికారి గుర్రాల రామకృష్ణయ్య ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సత్కరిస్తారు. అధ్యక్షులు  డాక్టర్ సి.మధుసూదనరావు,ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.రవికృష్ణ,కార్యనిర్వాహక కార్యదర్శి పత్తి రంగనాథ్,  క్యాంప్ కోఆర్డినేటర్ఈ సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడానికి కళాభిమానులందరినీ కళారాధన ఆహ్వానిస్తున్నది.

Share this