* నంద్యాలకు డాక్టర్ రవి కృష్ణ సేవలు వెల కట్ట లేనివి: లయన్స్ క్లబ్
* సామాజిక సేవలు నిరంతరం కొనసాగిస్తాం: డాక్టర్ రవి కృష్ణ
నంద్యాల : స్థానిక మధుమణి సమావేశ భవనంలో నంద్యాల లయన్స్ క్లబ్ వార్షిక సర్వసభ్య సమావేశం లో డాక్టర్ రవి కృష్ణకు సభ్యులు ఆత్మీయ అభినందన సత్కారం చేశారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ అభినందన కార్యక్రమంలో డాక్టర్ రవి కృష్ణ గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న వివిధ సామాజిక, సాంస్కృతిక, క్రీడా సేవలను అభినందిస్తూ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి కందుకూరి రంగస్థల పురస్కారం మరియు ఐఎంఏ జాతీయ సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు గజ మాల, తలపాగా,శాలువలు,జ్ఞాపికలు అందించి ఘన సత్కారం చేశారు.ఈ సందర్భంగా సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ క్లబ్ సంస్థల మాజీ చైర్మన్,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు భవనాసి నాగ మహేష్ , కళారాధన ఉపాధ్యక్షులు శ్రీకాంత్, కసెట్టి చంద్రశేఖర్ , కార్యనిర్వాహక కార్యదర్శి రవి ప్రకాష్ , లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రవి కృష్ణ గత 30 సంవత్సరాలుగా వైద్యునిగా విశిష్ట సేవలు అందించడమే కాకుండా కళారాధన ద్వారా కళా సాంస్కృతిక సేవలు, లయన్స్ క్లబ్ ద్వారా సామాజిక సేవలు, నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ద్వారా దివ్యాంగుల సేవా కార్యక్రమాలు, ఐఎంఏ ద్వారా వైద్య శిబిరాలు, పలు క్రీడా సంఘాల ద్వారా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా కార్యక్రమాలునిర్వహిస్తూనంద్యాలకు,నంద్యాల ప్రజలకు చేసిన సేవలు వెలకట్ట లేనివన్నారు. సామాజిక, సంక్షేమ సేవా కార్యక్రమాలలో అవిశ్రాంతంగా అలుపెరుగని రీతిలో నిరంతరం చేస్తున్న కృషి విశిష్టమైనదన్నారు. గతంలో కూడా డాక్టర్ రవి కృష్ణ సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారం, కళారత్న హంస పురస్కారాలు అందించిన విషయం గుర్తు చేసుకున్నారు. రవి కృష్ణ సేవలను గుర్తించి అవార్డులు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి లయన్స్ క్లబ్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ తన కళారంగ,సామాజిక సేవలు, క్రీడా కార్యక్రమాలు,దివ్యాంగుల సేవలను నిరంతరం కొనసాగిస్తానని ప్రకటించారు. లయన్స్ క్లబ్ సభ్యునిగా 30 సంవత్సరాలుగాకొనసాగుతున్నానని,సభ్యులు అందించిన ఆత్మీయ సత్కారానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ సేవా సంస్థల మాజీ చైర్మన్ ఏ వి ఆర్ ప్రసాద్, సూరన సరస్వత సంఘం అధ్యక్షులు సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, జోన్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు భవనాసి నాగ మహేష్, గురు రాజా స్కూల్ డైరెక్టర్ షావలి రెడ్డి, బవిరీసెట్టి శ్రీకాంత్, కసెట్టి చంద్రశేఖర్, కసెట్టి వేణు మాధవ్, రవి ప్రకాష్, ఆంజనేయులు గుప్తా, బైసాని రమేష్, ,కూర ప్రసాద్, పోసిన సుబ్బారావు, రైల్వే రామన్న, వెంకటేశ్వర్లు,రావుస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకయ్య, శ్రీరామ డిజిటల్స్ చంద్రమోహన్, బాబురావు, ఇమ్మడి రామకృష్ణుడు, రాహుల్ గ్రాఫిక్స్ చంద్రమౌళీశ్వర రెడ్డి, శివకుమార్ రెడ్డి, ఆడిటర్ వంక దారి భరత్ సోమేసుల నాగరాజు, తోట శ్రీనివాస్, కిషోర్, పవన్, మేడ చంద్రశేఖర్, రత్న కుమార్, రాజ్ పవన్, మనోజ్, వీరాంజనేయులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply