శ్రీ కాత్యాయని మెడికల్స్ & సర్జికల్స్ ను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

నంద్యాల  : స్థానిక పట్టణంలోని గాంధీచౌక్ వద్ద బుధవారం శ్రీ కాత్యాయని మెడికల్స్ మరియు సర్జికల్స్ అధునాతన షాపును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించినట్లు కాత్యాని మెడికల్స్ అధినేత/ సెవెన్ హిల్స్ హాస్పిటల్ చైర్మన్ రెంటాల మారుతి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మారుతీ కుమార్ కష్టపడే మనస్తత్వమే వారిని ఈ స్థాయికి తెచ్చిందని తెలిపారు. అతి తక్కువ ధరకే మన్నికైన, నాణ్యమైన మందులను అందుబాటులోకి తెచ్చామని ప్రజలందరూ షాపును తప్పకుండా సందర్శించాలన్నారు. షాపు ప్రారంభోత్సవం సందర్భంగా పెద్దకోటల గ్రామానికి చెందిన వైష్ణవి అనే చిన్నారికి రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ మారుతి కుమార్ విరాళంగా అందజేసిన వీల్ చైర్ ను మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రెంటాల మారుతి కుమార్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలోనే ఇది అతి పెద్ద ఫార్మసీ స్టోర్ అని మెడికలు మరియు సర్జికల్ హోల్ సేల్ మరియు రిటైల్ లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి , తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి పట్టణ అధ్యక్షుడు ఖలీల్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల , కోశాధికారి నాగేశ్వరావు, కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష, జనసేన నాయకులు సుధా మోహన్ రెడ్డి పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

Share this