* ఆలయ కార్య నిర్వాహక అధికారి మల్లవరపు నాగయ్య వెల్లడి
ప్రజాపవర్ ప్రకాశం జిల్లా / రాచర్ల : మండల పరిధిలోని జెల్లీవారి పుల్లలచెరువు అటవీ ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి మల్లవరపు నాగయ్య తెలిపారు.12న అంకురార్పణ,ద్వాజారోహణం, శేష వాహనం,హనుమంత వాహనం 13న స్వామి వారి కళ్యాణం,గరుడవాహనం,గజవాహనం 14న తెప్పోత్సవం,దివ్య రథోత్సవం 15న చక్రస్నానం కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.బ్రహ్మోత్సవాలకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.దాతలు అన్నదానాలు చేయనున్నారు.అలాగే భక్తులకు ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగ పంపిణీ చేయనున్నారు.భక్తులకు కాలక్షేపం కోసం పలు సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు నాలుగు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆలయా అధికారులకు సూచించారు.అలాగే స్వామివారి కల్యాణంలో పాల్గొనదలచిన దంపతులు రూ.2500 రుసుము చెల్లించి పాల్గొనాలని కోరారు.బ్రహ్మోత్సవాలకు రాచర్ల ఎస్ఐ పి.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఆసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డ చట్టారీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.బ్రహ్మోత్సవాలు విజయవంతానికి భక్తులు ప్రజలు అధికారులు అనధికారులు సంపూర్ణ సహకారం అందించాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి మల్లవరపు నాగయ్య కోరారు.
Leave a Reply