* దేశ ప్రజలకోసం గ్రామస్థాయిలో అభివృద్ధి
* 8500 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి ధ్యేయం
* డోన్ లో వికసిత భారత్ సంకల్ప యాత్ర
* భారీ కారు,బైక్ ర్యాలీ
* బిజెపి పార్టీలో భారీ చేరికలు
నంద్యాల జిల్లా/ డోన్ : దేశ ప్రజలకోసం గ్రామస్థాయిలో అభివృద్ధి చేసేందుకు వికసిత్ భారత్ తో దేశ అభివృద్ధి చెందుతుందని నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు,కాపు రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు.నంద్యాల జిల్లా పరిధిలోని డోన్ పట్టణంలో పార్టీ ఆదేశాలమేరకు జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కు కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పట్టణంలోకి వారు చేరుకోవడంతో బిజెపి కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.భారీ సంఖ్యలో కార్లు,బైకుల్లో ర్యాలీ నిర్వహించారు.డోన్ పట్టణంలో కానీ విని ఎరుగని విధంగా పూల వర్షం కురిపిస్తూ ర్యాలీ ముందుకు సాగింది.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వికసిత్ భారత్ సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరుగుతూనే భారత దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు.ప్రధాని మోదీ గ్రామ స్థాయిలో అభివృద్ధి చేయడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారని అన్నారు.ఆదివాసులు,గిరిజన వాసులు అభివృద్ధిలోకి తీసుకొని రావాలనే లక్ష్యంతో దేశంలోని 24 రాష్ట్రాలు,68 జిల్లాలు,8500 గ్రామ పంచాయతీల్లో మొదట వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వం ఏర్పాటై 11 ఏళ్లు పూర్తికావడంతో జరిగిన సంక్షేమం ప్రజలకు తెలిసే విధంగా అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు తెలియకపోవడంతో నష్టపోతున్నారని అన్నారు.గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తూ పథకాలు వివరిస్తున్నామని పేర్కొన్నారు.గ్రామస్థాయిలో ప్రజల సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నామని పేర్కొన్నారు.వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతుందని అన్నారు.విశాఖ పట్నంలో జరిగిన యోగా డే ప్రధాని నరేంద్ర మోదీ కి ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.యోగా తో సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం అవుతుందని అన్నారు.వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి ద్యేయంగా బీజేపీ ప్రభుత్వం సాగుతుందని అన్నారు.ఈ సందర్భంగా పలువురు బిజెపి పార్టీలో చేరారు.అనంతరం జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు,కాపు రామచంద్రా రెడ్డి లను ఘనంగా సన్మానించారు.వీరికి ప్రధాని మోదీ చిత్ర పటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మేడా మురళీధర్,చల్లా దామోదర్ రెడ్డి,ఎస్.వి.రమణ,హేమ సుందర్ రెడ్డి,నిమ్మకాయల సుధాకర్,లింగన్న,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply