భక్తుల సహకారంతోనే దేవాలయం అభివృద్ధి-దేవాలయ చైర్మన్ డాక్టర్ రవికిష్ణ

*   శ్రీ సుంకులమ్మ దేవాలయం హుండీ లెక్కింపు
*  గత సంవత్సరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు

ప్రజాపవర్  నంద్యాల  : స్థానిక పట్టణంలోని సుంకులమ్మ దేవాలయాన్ని భక్తుల సహకారంతో అభివృద్ధి చేశామని  ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ తెలిపారు. గురువారము పట్టణంలోని సుంకులమ్మ వీధిలో ఉన్న శ్రీ సుంకులా పరమేశ్వరీ  దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించారు. దేవాలయం కమిటీ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ హుండీ తెరిచి లెక్కింపు ప్రారంభించారు. అనంతరం చైర్మన్ డాక్టర్ హరికృష్ణ  మాట్లాడుతూ హుండీ ఆదాయం ఒక లక్ష తొంబై రెండు వేల  మూడు వందల ఎభై రూపాయల వచ్చిందని, దేవస్థానం బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గత సంవత్సరం ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేక పూజలు, శ్రీరామనవమి, శివరాత్రి కళ్యాణోత్సవాలు నిర్వహించే నిమిత్తం ఆలయం పక్కన ప్రత్యేక మండపం తో హాలు  నిర్మించామని, నూతన ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన, ఆలయం పైన నూతన రాతి విగ్రహాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా నంద్యాల పట్టణ సుంకులమ్మ భక్తుల సహాయ సహకారాలతో మరిన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.  హుండీ లెక్కింపు కార్యక్రమం  కార్యదర్శి చిమ్మా నాగన్న పర్యవేక్షణలో జరగగా సంయుక్త కార్యదర్శి బైగ్గారి మురళి, సహ కోశాధికారి బి.వి.ఎన్.ప్రసాద్,సభ్యులు పొన్న పాటి పుల్లయ్య,బైగ్గారి సురేష్, ఓజా ప్రసాద్, బైగ్గారి మనోజ్, బైగ్గారి కళ్యాణ్, ఓజా గురు స్వామి, పాయకట్టు హేమంత్, కాసర్ల సురేంద్ర, పొన్నపాటి మధు, ఓజా శేషు, పరమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share this