నంద్యాల జిల్లా /బేతంచెర్ల : ప్రముఖ పారిశ్రామిక కేంద్రంలోని కాళీ స్థలముల యజమానులు పిచ్చి మొక్కలు, ముళ్ళ కంపలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఖాళీ స్థలం యజమానులు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకుండా ఉండుటవలన ఆ స్థలంలో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు పెరిగి మూగజీవాలకు, పాములకు నిలయంగా మారుతున్నాయని అన్నారు. తద్వారా దారిలో వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు. కావున మీ స్థలాల్లో ఉన్న వాటిని వెంటనే తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంచుకోవాలని ఆయన తెలియజేశారు. లేనిచో పురపాలక చట్టం 1965 ప్రకారం పట్టణ ప్రణాళిక శాఖ మరియు ప్రజా ఆరోగ్యశాఖ సెక్షన్ల ప్రకారం బేతంచెర్ల నగర పంచాయతీ వారు చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని తెలిపారు.
పిచ్చి మొక్కలు, ముళ్ల కంపలను వెంటనే తొలగించాలి : మున్సిపల్ కమిషనర్ హరి ప్రసాద్

Leave a Reply