ప్రజాపవర్ నంద్యాల జిల్లా/శ్రీశైలం : శ్రీ మల్లికార్జున స్వామి వారికి సాయంకాలం ప్రదోషకాల పూజలు అనంతరం అన్నాభిషేకం నిర్వహిస్తారు.అనంతరం స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేస్తారు.సాయంత్రం స్వామివారి పూజల అనంతరం అమ్మవారికి ఎదురుగా ప్రదక్షణ మండపంలో అన్నాన్ని కుంభరాశిగా వేయబడుతుంది. అదేవిధంగా సింహం మండపం వద్ద కూడా భక్తులు అమ్మవారికి కుంభరాశిని సమర్పిస్తారు. తర్వాత సాంప్రదాయని అనుసరించే స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభం అవుతుంది. ఈ కుంభ హారతి సమయంలోనే అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలు అమ్మవారికి సమర్పించబడతాయి.ఈ పసుపు కుంకుమల సమర్పణకే శాంతి ప్రక్రియ అని పేరు.
శ్రీ మల్లికార్జున స్వామి వారికి అన్నాభిషేకం

Leave a Reply