రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

ప్రజాపవర్ నంద్యాల జిల్లా / బేతంచెర్ల : స్థానిక పట్టణ రైతు సంఘం ఆధ్వర్యంలో  శ్రీదేవి, భూదేవి చెన్నకేశవ స్వామి  తిరుణాల సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు  పోటీలను బండ సైజు 15 ఘ. అడుగులు నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ  మొదటి బహుమతి  50,000, రెండవ బహుమతి 40,000, మూడవ బహుమతి 30,000,  నాల్గవ బహుమతి  20,000 ,ఐదవ బహుమతి  10,000 వేల రూపాయలు  పెట్టినట్లు వారు తెలిపారు. ఈనెల   ఏప్రిల్ 17వ తేదిన  బేతంచర్ల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి భజన మందిరం లో తమ పేర్లను నమోదు చేసుకొను వచ్చునని వారు తెలిపారు. పాల్గొను వృషభ రాజులకు ఎంట్రీ ఫీజు 500/- రూపాయలు మాత్రమే.పూర్తి  వివరాలకు 9848759195,9885849113,9848965056 నంబర్లను సంప్రదించవలసిందిగా వారు కోరారు.

Share this