ప్రజాపవర్ కర్నూలు జిల్లా /కౌతాళం : మండలపరిధిలోని ఊరుకుంద గ్రామంలో వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామి వార్లను ఎమ్మెల్సీ బిటి నాయుడు దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఈవో అండ్ డిసి మేడిపల్లి విజయ రాజు శ్రీ స్వామి దర్శనం, స్వామివారి శేష వస్త్రాము, లడ్డూ ప్రసాదాలు,ఆశీర్వాదాలు కల్పించి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్లు జె కె మల్లికార్జున, కె వెంకటేశ్వర్లు, ప్రధాన అర్చకులు ఈరప్ప స్వామి ముఖ్య అర్చకులు నాగరాజ్ స్వామి, శివన్న స్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్ జూనియర్ అసిస్టెంట్ వీరేష్ మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ నరసింహ ఈరన్న స్వామి వార్లను దర్శించుకున్న ఎమ్మెల్సీ బిటి నాయుడు

Leave a Reply