లోకకల్యాణం కోసం శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారికి కుంభోత్సవం

ప్రజాపవర్ నంద్యాల జిల్లా / శ్రీశైలం :  శ్రీశైల మహాక్షేత్రంలో లోకకల్యాణం కోసం శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారికి సాంప్రదాయంగా కుంభోత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవంలో  గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్న రాసి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు. కాగా ఉదయం జరిగిన కార్యక్రమంలో దాదాపు 5,000 వేల గుమ్మడికాయలు, 5000వేల పైగా కొబ్బరికాయలు, 20 వేలకు పైగా నిమ్మకాయలు మరియు వండిన అన్నం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు.
ఈ ఉత్సవంలో అధిక పరిమాణంలో పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పిస్తారు.
ఇది ప్రాతఃకాల మొదటి విడత సాత్విక బలి.
స్థానిక వ్యాపారులు కూడా అమ్మవారికి కుంభకోత్సవం నిర్వహిస్తారు.

Share this