* తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
పలనాడుజిల్లా/ మాచర్ల : రాజకీయ కక్షతో వైసీపీ రక్కసిమూకల చేతిలో హతులైన వెల్దుర్తి మండలం, గుండ్లపాడు చెందిన టిడిపి కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగం కల్పిస్తూ ఏపీ కేబినెట్ ఏకగ్రీవంగా మంగళవారం తీర్మానించింది. ఈ విషయాన్ని ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకోవడంలో అధినేత చంద్రబాబు ముందుంటారని నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కొనియాడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దివంగత కార్యకర్త చంద్రయ్య కుటుంబానికి చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకొని ఆదుకున్నారని పార్టీ పెద్దలు వర్షం తెలియజేస్తూ ప్రశంసిస్తున్నారు.
Leave a Reply