కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్

నంద్యాల : పాణ్యం మండల పరిధిలోని ఎస్ కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగలింగేశ్వర స్వామి వార్లను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గురువారం దర్శించుకున్నారు. వారి రాకకు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ శర్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగలింగేశ్వర స్వామి వార్లకు కుంకుమార్చన, అభిషేకం ,విశేషపూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో శేష వస్త్రాలు, శాలువలతో పూలమాలలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నరేంద్ర నాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Share this