* హెడ్మాస్టర్ కు మైకు బహుమతి ప్రధానం చేస్తున్న పూర్వ విద్యార్థులు
రాచర్ల : మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1996-2000 బ్యాచ్ విద్యార్థులు ఇటీవల పాఠశాల యందు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.పాఠశాలలో మైక్ సిస్టమ్ లేదు అని తెలుసుకొని పూర్వపు విద్యార్థులు అందరూ మాట్లాడుకొని పాఠశాలకు 30వేలు రూపాయల విలువ గల సౌండ్ సిస్టం మైక్ ను బహుమతి ప్రధానం చేశారు.ఈ మైక్ సెట్ ను శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామ్ నాయక్ కు మైక్ సెట్ అందజేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామ్ నాయక్ మాట్లాడుతూ పూర్వపు విద్యార్థులను అభినందించారు.చదువుకున్న పాఠశాలను గుర్తు పెట్టుకొని ఈ విధంగా పాఠశాలకు సహకరించడం చాలా గొప్ప విషయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పి.రమణారెడ్డి,పాఠశాల పూర్వ విద్యార్థులు యల్లా.చంద్రమోహన్,సిఎ.జ్యోస్ కుమార్,ఓ.శ్రీనివాసులు,పి.శ్రీనివాసులు,పి.ఆయుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply