రాష్ట్ర హస్త కళల చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన – జనసేన నేతలు

తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించిన శుభ సందర్భంగా తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు సుమన్ బాబు బుధవారం టెంపుల్ టౌన్ వారి నివాసంలో జనసేన నేతలు 27 వార్డ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఆది, సుధాకర్, సుమంత్, పవన్ కుమార్, శివ లతో కలిసి పళ్ళ బోకే ను అందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు అయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆశయ సాధనకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని దిశ నిర్దేశించారు.

Share this