కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి: నారా లోకేశ్

న్యూ ఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేశ్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో నారా లోకేష్ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకరించాలని ఆయనను కోరారు. న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఎపి రాజధానికి రావడానికి 500 కి.మీ.కు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. యువగళం పాదయాత్ర సందర్భంగా సీమ ప్రజలు, న్యాయవాదులు హైకోర్టు బెంచి చేయాలని విన్నవించారని వారికి న్యాయం చేయాలని తెలిపారు.

Share this