* పార్టీలు వేరు… కానీ వ్యక్తిగత విభేదాలు లేవు
ప్రజాపవర్ రాచర్ల : పార్టీలు వేరు కానీ వ్యక్తి గత విభేదాలు లేవనీ ప్రజల సేవలో ఇరువురం ఒక్కటే అని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యానించగా ఆయన అభిప్రాయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఏకీభవిస్తున్నట్లు తన హావభావాలను వ్యక్తపరిచారు.రాచర్ల మండలం పుల్లలచెరువు గ్రామసమీపం నల్లమల అభయారన్యాలలో నెలకొని ఉన్న శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రంగనాయక స్వామికి కళ్యాణం జరిగింది.వేలాది మంది భక్తుల సమక్షంలో వేదమంత్రోచ్చారనలతో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి దంపతులు,మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు దంపతులు కలిసి స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు.వీరితోపాటు అనేకమంది దంపతులు స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ నేను,సోదరులు అశోక్ రెడ్డి పార్టీలు వేరు అభిప్రాయ బేధాలు ఉండవచ్చు కానీ వ్యక్తిగత భేదాలు మాత్రం లేవని కలిసిమెలిసి ప్రజా సేవల్లో ఉంటామని అన్నారు.ఎన్నికల్లో పోటీ చేస్తాం ప్రజలు దేవుడు ఆశీస్సులు ఎవరికైతే ఉంటాయో వారు ఎన్నికల్లో గెలిచి దేవునికి ప్రజలకు సేవ చేసే అవకాశం పొందుతాం తద్వారా ప్రజాసేవలు చేస్తాం.భవిష్యత్తులో కూడా ఇదేవిధంగా కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటామని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యానించగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఏకీభవిస్తున్నట్లు తన హావ భావాలను వ్యక్తికరించారు.అన్నా రాంబాబు,ముత్తుముల అశోక్ రెడ్డి ఇరువురు నేతలు కలిసి జరుపుతున్న స్వామి కళ్యాణం దృశ్యం చూస్తున్న భక్తుల దృష్టి ఎక్కువ శాతం ఇరువురి నేతలపై పడింది.అక్కడున్న వేలాదిమంది ప్రజలు భవిష్యత్తులో ఇరువురు నేతలు ఇలాగే కలిసిమెలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే బాగుంటుందని ఆనందం వ్యక్తం చేశారు.
రంగనాయక స్వామికి పూలమాలలు సమర్పిస్తున్న ఎమ్మెల్యే ,మాజీ ఎమ్మెల్యే

Leave a Reply