* స్వామివారి కల్యాణాన్ని వీక్షించిదానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు
ప్రజాపవర్ ప్రకాశం జిల్లా /రాచర్ల : మండల పరిధిలోని జెల్లీ వారి పుల్లలచెరువు సమీపంలో దట్టమైన నల్లమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానంలో శ్రీ రంగనాయక స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వేలాది ముందు భక్తులు తరలివచ్చారు.ముందుగా స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలను ఊరేగింపు తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించారు. వేలాదిమంది భక్తులు వీక్షిస్తుండగా అర్చక స్వాములు అన్నవరం పాండు రంగాచార్యులు,అన్నవరం సత్యనారాయణ చార్యులు,అన్నవరం వెంకట రంగాచార్యులు,అన్నవరం మోహనాచార్యులు రమణయ్యల బృందం వేద మంత్రాలతో స్వామివార్ల కళ్యాణ అత్యంత వైభవంగా జరిపించారు.
కళ్యాణ వేదికపై స్వామివారి దేవేరులను ప్రత్యేకంగా అలంకరించి అర్చక స్వాములు వేద పండితులతో వేదమంత్రాలతో జరిపించారు.ఆలయ కార్యనిర్వహణ అధికారి మల్లవరపు నాగయ్య స్వామివారి కల్యాణ కార్యక్రమం అవసరమైన ఏర్పాట్లును,భక్తులకు ఏటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో సుమారు 30 జంటలు వరకు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం జరిగిన స్వామివారి కల్యాణం మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వేలాదిమంది పాల్గొన్నారు.పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ కళ్యాణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
నేత్రపర్వంగా రంగనాయకుని కల్యాణం

Leave a Reply