వైభవంగా శ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట

* ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి
గడివేముల ఏప్రిల్ 13 (ప్రజా పవర్ )  : మండల పరిధిలోని గ్రంధివేముల గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో, బంధుమిత్రులతో గ్రంధి వేముల గ్రామం పండుగ  వాతావరణం నెలకొంది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తి శ్రద్దల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజలు, హోమాలు, మహాపూర్ణ హుతితో పాటు పలు పూజలు నిర్వహించారు. ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పిటిసి చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, గ్రంధి వేముల రామ్మోహన్ రెడ్డి, వంగాల మురళీధర్ రెడ్డి, గడివేముల మూల పెద్దమ్మ ఆలయకమిటీ చైర్మన్ దేశం రమణారెడ్డి, అంగజాల కృష్ణ యాదవ్, హర్షవర్ధన్, ఒడ్డు  లక్ష్మీదేవి, బిలకల గూడూరు మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, కరిమద్దెల ఈశ్వర్ రెడ్డి, కంది శ్రీనివాసులు, శ్రీ దుర్గా భోగేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు శ్యాంసుందర్ శర్మ  తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నాగార్జున రెడ్డి బందోబస్తు నిర్వహించారు.

Share this