చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ జమాల్ బి ,సెక్రెటరీ నాగ కాంత

ప్రజాపవర్ నంద్యాల జిల్లా/మహానంది :  మండల పరిధిలోని బొల్లవరం గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ జమాల్ బి ,సెక్రెటరీ నాగ కాంత చలివేంద్రం ప్రారంభించారు. నీటిని పొదుపుగా వాడాలని దుర్వినియోగం చేయకూడదని సూచించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పంచాయతీ కార్యాలయంలో పూలమాలవేసి నివాళులర్పించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు .ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గడ్డం రామయ్య, అద్దంకి వెంకట రాముడు, బండి శ్రీనివాసులు, తెల్లన్న, తిరుపాలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this