నంద్యాల ఫిజియో డాక్టర్ కు అంతర్జాతీయ హెల్త్‌కేర్ అచీవర్స్ ఎక్సలెన్స్ అవార్డు

* అంతర్జాతీయ హెల్త్‌కేర్ అచీవర్స్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ఫిజియోథెరపిస్ట్ మరియు సైకాలజిస్ట్  డా. శివ బాలి రెడ్డి కాటసాని

నంద్యాల : నంద్యాలకు    చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ మరియు సైకాలజిస్ట్ అయిన డా. శివ బాలి రెడ్డి కాటసాని  చేస్తున్న అత్యుత్తమ సేవలను గుర్తించి అంతర్జాతీయ హెల్త్‌కేర్ అచీవర్స్ ఎక్సలెన్స్ అవార్డును విశాఖపట్నం లో ప్రెస్ క్లబ్ వెల్ఫర్ ఫౌండేషన్ బుధవారం నిర్వహించిన సన్మాన సభలో ఉత్తమ ఫిజియో మరియు సైకాలజిస్ట్ అవార్డుతో సత్కరించారని ఐ.ఏ.పి. నంద్యాల కన్వీనర్ డాక్టర్ రోహిణి విజయ్ తెలిపారు.డా. శివబాలిరెడ్డి  శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధించి అనేక వినూత్న విధానాలతో, సమగ్ర చికిత్సా విధానాలను అందిస్తూ, ఫిజియోథెరపీ, సైకాలజీ రంగాల్లో సాంకేతిక నైపుణ్యం, పరిశోధనలకు ఈ అవార్డు రావడం గర్వించదగ్గ విషయం అని  నంద్యాల ఐ.ఏ.పి సెక్రటరీ  డాక్టర్ జగదీశ్వర రెడ్డి తెలియజేశారు. ఈ సందర్బంగా డాక్టర్ శివబాలిరెడ్డి ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రాముఖ్యమైన ఈ అవార్డు, వైద్య సేవల్లో ఉత్తమ నిబద్ధత, సేవా దృక్పథానికి గుర్తింపుగా గౌరవించబడే ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రతిభకు, సేవాభావానికి గౌరవం లభించిందనీ, ఇది కేవలం వ్యక్తిగత గౌరవంమే కాక, ఫిజియోథెరపీ మరియు సైకాలజీ వైద్యరంగానికి గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా నిలిచిందని  సంతోషం వ్యక్తం చేశారు.డా. శివ బాలి రెడ్డికి ఈ పురస్కారం అందిన సందర్భంగా ప్రైమ్ న్యూరో రిహ్యాబిలిటేషన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజారెడ్డి,భారతి సన్నపురెడ్డి, సెవెన్ హిల్స్ మరియు కాత్యాయని మెడికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి కుమార్, ఫిజియోథెరపీ డా.లక్ష్మణ్,చరణ్,ఫిజియో వైద్యులు,కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share this