భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య సేవలు అందిస్తాం. డాక్టర్ హరినాథ్ రెడ్డి

*  జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవ ఉచిత వైద్య శిబిరం
* సాయి బాలాజీ నర్సింగ్ హోమ్, హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సంయుక్త నిర్వహణ
* వైద్య సేవలు అందించిన ప్రముఖ నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ వెంకటస్వామి

ప్రజాపవర్ నంద్యాల : భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య సేవ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు బాలాజీ నర్సింగ్ హోమ్ డాక్టర్ హరినాథ్ రెడ్డి తెలిపారు.  స్థానిక బాలాజీ నర్సింగ్ హోమ్ లో  శనివారం జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం పురస్కరించుకుని నంద్యాల ఐఎంఏ సహకారంతో స్థానిక డేనియల్ పురం గేట్ దగ్గర ఉన్న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్, హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో ఉచిత మూర్చ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. వ్యాధి గ్రస్టులకు ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు హరినాద్ రెడ్డి గారు తెలిపారు.
ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,  కార్యదర్శి డాక్టర్ పనీల్, సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ హరినాధ రెడ్డి, యశోద ఆసుపత్రి నరాల వ్యాధి నిపుణులు డాక్టర్ వెంకటస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ నంధ్యాలలో పలువురు వైద్యులు వివిధ సందర్భాలు పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులకు, వృద్ధాశ్రమాలలో ఉన్న వృద్ధులకు, దేశ రక్షణలో సైన్యం,వాయుసేన, నేవీలలో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు నంద్యాల ఐఎంఏ తరపున నంద్యాల పట్టణ వైద్యులు ఉచిత ఓపిడి సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు.డాక్టర్ వెంకటస్వామి మాట్లాడుతూ మూర్చ లక్షణాలు కనిపించినప్పుడు సరైన పరీక్షలు చేయించుకుని వ్యాధి స్థాయిని నిర్ధారించి సరైన మందులు క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా మూర్చ వ్యాధి నుండి వచ్చే సమస్యలను నివారించవచ్చన్నారు. డాక్టర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ తమ ఆసుపత్రి తరపున  వైద్య శిబిరాలు  భవిష్యత్తులో కూడా  నిర్వహించి పేదలకు సేవలు అందిస్తామని అన్నారు. డాక్టర్ వెంకటస్వామి దాదాపు 150 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి మెదడు గ్రాఫ్ పరీక్షను(ఈ ఈ జి) ఉచితంగా నిర్వహించి మందులను ఉచితంగా అందజేశారు.
ఈ వైద్య శిబిరం నిర్వహణలో బాలజీ నర్సింగ్ హోమ్ సిబ్బంది మధు, ఖాదర్, యశోద ఆసుపత్రి బాబయ్య పాల్గొన్నారు.

Share this